Home » Latest News » అమెరికాలో టెస్లా సీఎఫ్ఓ తో భేటీ అయిన లోకేశ్ 


పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి రప్పిందుకు  కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఐదేళ్ల పాలనలో ఎపిని అప్పుల రాష్ట్రంగా మార్చిన వైఎస్ ప్రభుత్వాన్ని  గద్దె దించిన ప్రజలకు మరో శుభవార్త.  అమెరికాలో బిజిబిజీగా ఉన్న మంత్రి లోకేశ్ టెస్లా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలు తయారు చేసే టెస్లాను ఎపికి తెచ్చే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది.టెస్లా సీఈఓతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.ఇప్పటికే పరిశ్రమల శాఖ  టెస్లాతో బాటు మరికొన్ని సంస్థలకు  లేఖలు రాసింది.  2019 కి ముందు చేసుకున్న ఒప్పందాలను  కూటమి ప్రభుత్వం కూలకశంగా అధ్యయనం చేసి ఆ ఒప్పందాలను పునరుద్దరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది.  విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 13.12 లక్షల  కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలను చేసుకున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే అడ్డంకుల మీద ప్రభుత్వం దృష్టి సారించింది.  ఎకనామిక్  డెవలప్ మెంట్ బోర్డ్ ఈ  మేరకు వివరాలు సేకరించింది.  దాదాపు 75 సంస్థల వివరాలను తెప్పించుకుని చర్చలు జరపాలని బోర్డు నిర్ణయించింది. దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.